Bigg Boss Telugu 5లోకి నాగార్జున హీరోయిన్:అందుకే ఆ పోస్టులు పెడుతుందా!

0
13

తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేస్తూ.. నాలుగేళ్లుగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఏకంగా నాలుగు సీజన్లను ప్రసారం చేశారు నిర్వహకులు. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో పేరు కూడా లీకైంది. నాగార్జున హీరోయిన్ ఈ సారి హౌస్‌లోకి వెళ్తుందట.

మన బిగ్ బాస్.. నేషనల్ రికార్డులు

దేశంలోని ఎన్నో భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. అన్నింట్లోనూ ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, అన్నింటి కంటే తెలుగు వచ్చే షోకు మాత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా మన దగ్గర మాత్రమే టీఆర్పీలో అదిరిపోయే రేటింగ్ వస్తోంది. మరీ ముఖ్యంగా మూడు, నాలుగు సీజన్లలో నేషనల్ రికార్డులు క్రియేట్ అయ్యాయి.

ఐదో సీజన్‌కు శ్రీకారం చుట్టేశారుగా

తెలుగులో బిగ్ బాస్ షో ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే, కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావంతో ఐదో సీజన్ ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే ఈ షోకు సంబంధించిన పాజిటివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఏకంగా షో నిర్వహకులు బిగ్ బాస్ ఐదో సీజన్ లోగోను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

పనులు పూర్తి.. ఫినిషింగ్‌పై ఫోకస్

బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సెట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌కు సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయని.. ప్రస్తుతం ఇంటి లోపలి రూమ్‌ల ఫినిషింగ్ వర్క్ జరుగుతుందని తెలిసింది.

కంటెస్టెంట్ల ఎంపిక… వీళ్ల పేర్లు లీక్

ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. వీళ్లతో పాటు షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్ సహా పలువురి పేర్లు ఈ సారి లిస్టులో ఉన్నట్లు బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్‌లోకి నాగార్జున హీరోయిన్

బిగ్ బాస్ నిర్వహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు దాదాపుగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే సీజన్‌కు ఎంపికైన ప్రముఖుల వివరాలు కూడా లీక్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఐదో సీజన్‌లోకి అక్కినేని నాగార్జున ‘బాస్’ సినిమాలో నటించిన పూనమ్ బజ్వా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఆ పోస్టులు పెడుతుందా!

ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాల్లో నటించకున్నా పూనమ్ బజ్వా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తరచూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్‌కు సెలెక్టైన కారణంగా ఈ అమ్మడు అందాల విందు చేస్తూ హాట్ టాపిక్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈమె షోలో ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి.

ఈ హీరోయిన్ నేపథ్యం ఏమిటంటే!

పూనమ్ బజ్వా 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన ‘మొదటి సినిమా’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, అక్కినేని నాగార్జున సరసన ‘బాస్’ అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్ చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత యన్‌.టి.ఆర్ బయోపిక్‌లో నారా లోకేశ్వరిగా నటించింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here