హీరో కంటే డైరెక్టర్ శంకర్కు ఎక్కువ రెమ్యునరేషన్.. వామ్మో మరీ అంత ఎక్కువనా?

0
10

సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి రెమ్యునరేషన్ విషయంలో హీరోలదే అప్పర్ హ్యాండ్. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగిన అనంతరం దర్శకుల వేతనాలు కూడా పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పెద్దదైతే కొందరు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఇక దర్శకుడు శంకర్ కూడా నెక్స్ట్ చేయబోయే సినిమాకు హీరో కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది.

బడ్జెట్ లిమిట్స్ పెట్టుకోకుండా

దర్శకుడు శంకర్ కెరీర్ మొదటి నుంచి పెద్ద సినిమాలను అలవాటు చేసుకుంటూ వచ్చాడు. ఎలాంటి కథ అయినా సరే గ్రాండ్ గా తెరకెక్కించాలని అనుకుంటారు. నిర్మాతలు కూడా శంకర్ తో సినిమా అంటే బడ్జెట్ లిమిట్స్ పెట్టుకోకుండా వర్క్ చేస్తుంటారు. ఇక 2.ఓ అనంతరం కాస్త ఆయన రేంజ్ తగ్గినట్లు టాక్ వస్తున్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గలేదని సమాచారం.

ఇండియన్ 2 కోసం

శంకర్ తో సినిమా చేయాలి అంటే మినిమమ్ 150కోట్లు పెట్టుకోవాల్సిందే. మరికొన్ని సార్లు ఆ సంఖ్య 200కోట్లను కూడా దాటుతోంది. ఇండియన్ 2 కోసం లైకా సంస్థ ఫిక్స్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువగా పెరగడంతోనే అసలు గొడవలు మొదలయ్యాయి. అలాగే శంకర్ రెమ్యునరేషన్ కూడా బ్యాలెన్స్ ఉండడంతో ఆ సినిమా ఎటు తెలకుండానే ఆగిపోయింది.

దిల్ రాజు – రామ్ చరణ్ తో చర్చలు

ఇక త్వరలోనే రామ్ చరణ్ 15వ సినిమాను స్టార్ట్ చేయాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్ – నిర్మాత దిల్ రాజులతో చర్చలు కూడా జరిపారు. దాదాపు స్క్రిప్ట్ ప్లాన్ మొత్తం సెట్టయ్యింది. ఇక షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం. శంకర్ అప్పుడే లొకేషన్స్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

శంకర్ కు ఎక్కువ రెమ్యునరేషన్?

ఇక సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో రామ్ చరణ్ 30కోట్లకు పైగా అందుకుంటూ ఉండగా శంకర్ కు మాత్రం అంతకంటే ఎక్కువగా ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి బడ్జెట్ భరిగానే ఉంటుంది. ఇక శంకర్ పారితోషికం 60కోట్లకు టచ్ అవుతున్నట్లు టాక్ అయితే వస్తోంది. అయితే ఆ రెమ్యునరేషన్ లో ముందు అడ్వాన్స్ కొంత ఇచ్చి మిగతాది సినిమా రిలీజ్ అనంతరం షేర్ చేసుకొనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here