హీరోగా బండ్ల.. నిజమేనా, ఆ ట్వీట్ కి అర్ధమేంటి ?

0
10

బండ్ల గణేష్ అనే పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు.. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే డానికి ఊతం ఇచ్చేలాగా ట్వీట్ చేశారు.

కమెడియన్ గా ఎంట్రీ

అప్పుడెప్పుడో 1996లో వినోదం అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా సుస్వాగతం సినిమాలో నటించడంతో ఒక మలుపు తిరిగింది. అందుకే ఎప్పుడూ ఆయన పవన్ కళ్యాణ్ తన దేవుడిగా చెప్పుకుంటూ ఉంటాడు.. సుస్వాగతం సినిమాలో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

నిర్మాతగా మారి

అలా నువ్వు నాకు నచ్చావ్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, అతడే ఒక సైన్యం, మల్లీశ్వరి పోకిరి, ఒక విచిత్రం ఇలా వరుస సినిమాల్లో నటించారు. అయితే కమెడియన్గా కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఆయన నిర్మాతగా మారారు. రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.

టెంపర్ తో గ్యాప్

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్మార్ సినిమా డిజాస్టర్ గా నిలవగా గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాద్షా, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలతో మళ్లీ హిట్స్ అందుకున్నారు. తర్వాత సచిన్ జోషి హీరోగా వచ్చిన నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలు రెండూ కాస్త నిరాశ పరిచాయి.. చివరిగా 2015లో వచ్చిన టెంపర్ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత సైలెంట్ అయ్యారు.

మండేలా రీమేక్ ?

ఇక ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. చాలా రోజుల నుంచి బండ్ల గణేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండగా దాని మీద ఇప్పటి దాకా సరైన క్లారిటీ మాత్రం లభించ లేదు ముందుగా ఆయన తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా అనే సినిమా రీమేక్ లో నటించిన పోతున్నారని ప్రచారం జోరుగా జరగగా ఆ తర్వాత కాదని తేలింది.

హింట్ ఇచ్చినట్టేనా

ఇప్పుడు మళ్లీ ఆయన హీరోగా నటిస్తున్నాడు అని మాత్రం మొదలయ్యాయి వెంకట్ అనే కొత్త దర్శకుడు కథ నచ్చడంతో ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఇది కూడా ప్రచారానికి పరిమితం కాగా, తాజాగా ఒక ఛానల్ చేసిన ట్వీట్ ను బండ్ల షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా నిజంగానే బండ్ల చేస్తున్నాడేమో అని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో ? అనేది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here