‘హరిహర వీరమల్లు’..రత్నం గారి అసలు టెన్షన్

0
28

సినిమా నిర్మాణంలో ఎక్కువ లాభ పడేది ఎవరూ అంటే ప్రొడ్యూసర్ అని చెప్తారే కానీ ఎక్కువ టెన్షన్ పడేది కూడా ఆయనే అని చెప్పరు. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాణం జరిగేటప్పుడు ఏ మాత్రం బ్రేక్ వచ్చినా పై ప్రాణాలు పైనే పోతాయి. కోట్ల డబ్బు అప్పటికే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సజావుగా స్మూత్ గా షూటింగ్ జరిగి పూర్తి కాకపోతే అంతా నష్టమే. ఓ ప్రక్కన ఫైనాన్సియర్స్ పీకేస్తూంటారు. మరో ప్రక్క అప్పులతో ఫ్యామిలీ స్టగుల్స్ పడుతూంటూంది. ఎంతో మంది పెద్ద నిర్మాతలు అనుకున్న వాళ్ళు కూడా తర్వాత కాలంలో చితికిపోయారు. కరోనా దెబ్బతో ఇప్పుడు మళ్లీ అదే పరిస్దితి అంతటా కనిపిస్తోంది. నెలలు తర్వాత షూటింగ్ లు మధ్యలో ఆగిపోయి..ఆర్టిస్ట్ లు కు ఏమైనా అయితే ఏంటి పరిస్దితి అనేది క్షణ క్షణం భయం భయంగా మారిపోతోంది.

నిర్మాత ఎ.ఎం.రత్నం కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చారు. కానీ గత కొంతకాలంగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్నారు. అయితే కరోనా తో షూటింగ్ ఆగిపోయి ఆయన చాలా చాలా వర్రీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా డబ్బు సినిమాపై పెట్టేసారు. ఇందులో చేస్తున్న ఆర్టిస్ట్ లుకు ఏమైనా అయితే మళ్లీ రీషూట్ లు చేయాల్సి వస్తుంది. మరో ప్రక్క ఇప్పటికే సినిమా ప్రారంభించి చాలా కాలమైపోయింది. ఈ పాటికి రిలీజ్ కు వెళ్లిపోతుంది అనుకుంటే ఇంకా సాగుతోంది. బ్రేక్ లు పడుతూనే ఉంది. దాంతో రిలీజ్ డేట్ కు అనుకున్నట్లుగా రిలీజ్ చేయగలమా అనేదే మరో టెన్షన్. అయితే అదే సమయంలో కొంతలో కొంత రిలీఫ్..వకీల్ సాబ్ సూపర్ హిట్ అవటం. దాంతో ఈ సినిమా బిజినెస్ కు మంచి ఊపు రావటం.

 పవన్ కల్యాణ్  హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్  హీరోయిన్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో చాలా సినిమాలు షూటింగ్‌తో పాటు విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా కూడా వాయిదా పడింది.

ఇలాంటి వార్తలపై ఎ.ఎం.రత్నం స్పందిస్తూ… ‘‘సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికే తెరపైకి రానుంది. దర్శకుడు క్రిష్ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాదు సంక్రాంతి పండగ అంటే ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల చిత్రం విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని’’ వెల్లడించారు.

17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నేతృత్యంలో పవన్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here