‘స్టైలిష్ స్టార్’తో ట్రెండింగ్ డైరెక్టర్ సినిమా..?

0
31

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలపరంగా స్పీడ్ పెంచినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పుష్ప సినిమా పూర్తి కానేలేదు. అప్పుడే తదుపరి సినిమాల గురించి ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అలాగే సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేస్తామని మేకర్స్ రిలీజ్ డేట్ అయితే వదిలారు. కానీ ప్రస్తుతం సినిమాలు కంప్లీట్ అవ్వడంతో పాటు విడుదలయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు.. అనేది ప్రశ్న. ఇప్పటివరకు ఈ ప్రశ్నకు సమాధానం లభించలేదు. కానీ పలువురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపించగా.. ఈ మధ్యన తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ పేరు తెరమీదకి వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్నటువంటి పేరు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో మహర్షి సినిమా తర్వాత వంశీ నుండి మరో సినిమా రాలేదు. వంశీ ప్రస్తుతం కోలీవుడ్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ తో వంశీ సినిమా ఉండబోతుందని గాసిప్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మరి నిజంగానే వంశీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయకతప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here