స్టార్ డైరెక్టర్ తన ‘ఫ్రెండ్’కు బిగ్ బ్రేక్ ఇవ్వనున్నాడా..??

0
15

టాలీవుడ్ కమెడియన్ కం హీరో సునీల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన సునీల్.. ఎన్నో సినిమాలను తన కామెడీతో నిలబెట్టాడు. కానీ మధ్యలో హీరో అయ్యాక కమెడియన్ రోల్స్ చేయడం మానేసాడు. కానీ హీరోగా సక్సెస్ అయినప్పటికీ వరుస ప్లాప్స్ కారణంగా ఎక్కువకాలం నిలబడలేకపోయాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన మిత్రుడు డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమాతో కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం చేతిలో పలు సినిమాలు ఉన్నాయని టాక్. కానీ మళ్లీ కెరీర్ ప్రారంభించాడు కాబట్టి జాగ్రత్తగా స్టెప్స్ వేయాలని చూస్తున్నాడట.

అయితే మొన్నటివరకు కామెడీతో.. హీరో క్యారెక్టర్లతో అలరించిన సునీల్.. ఇప్పుడు విలన్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడట. గతేడాది ‘కలర్ ఫోటో’ సినిమాతో సునీల్ తనలోని విలన్ కోణాన్ని చూపించాడు. అయితే ఈసారి ఓ బిగ్ మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ కోడైకూస్తోంది. అదికూడా తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న సినిమాలో అంట. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ‘అయినను పోయిరావలే హస్తినకు’. అరవింద సమేతలో త్రివిక్రమ్ క్యారెక్టర్ ఇచ్చినా పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో ఎలాగైనా సునీల్ కు మంచి బ్రేక్ ఇవ్వాలని విలన్ రోల్ ఇస్తున్నట్లు సినీవర్గాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి త్వరలో మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here