స్టార్ కిడ్ సరసన ఛాన్స్ కొట్టేసిన వింక్ బ్యూటీ

0
32

సౌత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నార్త్ ప్రేక్షకులను కూడా తన ముద్దుగన్ను తో పేల్చేసిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మలయాళంలో ఈమె చేసిన మొదటి సినిమా నిరాశ పర్చగా ఇతర భాషల్లో కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే ఈమె చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చగా మరో సినిమా ఇష్క్ తో ప్రేక్షకుల ముందుకు తేజ తో కలిసి వచ్చేందుకు సిద్దం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ వింక్ బ్యూటీ తెలుగు రెండవ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ అమ్మడికి మరో బిగ్ ఛాన్స్ కోలీవుడ్ నుండి దక్కినట్లుగా సమాచారం అందుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ ఆధిత్య వర్మతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆధిత్య వర్మ లో ధృవ్ నటన మరియు బాడీ లాంగ్వేజ్ యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో కోలీవుడ్ లో ధృవ్ కు మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఆయన తదుపరి సినిమా కోసం విక్రమ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తండ్రితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న ధృవ్ త్వరలో మరో రెండు సినిమాల్లో కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అందులో ఒక సినిమాకు మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వం వహించబోతున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఆ సినిమాలో ధృవ్ మాస్ ఆడియన్స్ కు మరింతగా చేరువ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాలో ధృవ్ కు జోడీగా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరికి జోడీ సరిగ్గా సెట్ అవుతుందని ఫొటో షూట్ తర్వాత నిర్ధారణకు వచ్చారు. టెస్ట్ షూట్ కూడా నిర్వహించి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి వింక్ బ్యూటీకి స్టార్ కిడ్ తో అయినా లక్ కలిసి వచ్చి కమర్షియల్ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here