స్టార్ కమెడియన్ తో ‘మండేలా’ తెలుగు రీమేక్..?

0
35

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలంగా రీమేక్ వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అప్ కమింగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరూ రీమేక్స్ పైనే ఇంటరెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో స్టార్ యాక్టర్స్ మలయాళం – తమిళ సినిమాలను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ మధ్యకాలంలో సొంత కథలతో జనాలను మెప్పించలేక పోతున్నారని.. అందుకే వేరే భాషలో ఆల్రెడీ సూపర్ హిట్ అయినటువంటి సినిమాలే రీమేక్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచిస్తున్నట్లు టాక్. మరి ఇదిలా ఉండగా.. ఓటిటి సినిమాలు కూడా టాలీవుడ్ లో రీమేక్స్ గా రాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. రీసెంట్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘మండేలా’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే విడుదలైంది.

ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ రీమేక్ హక్కులను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర దక్కించుకున్నారు. అయితే తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. కానీ సినిమా మొత్తానికి వివాదాలతో పాటుగా సూపర్ హిట్ అందుకొని విమర్శకుల నుండి ప్రశంసలు సొంతం చేసుకుంది. అలాగే యాక్టర్ యోగిబాబు కూడా ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో యాక్టర్ కం కమెడియన్ సునీల్ తో రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ మాక్సిమం సునీల్ పేరు ఖరారు అయినట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సెన్సిబుల్ స్టోరీని హ్యాండిల్ చేయగల డైరెక్టర్ కోసం ప్రస్తుతం ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here