‘సూపర్ స్టార్’తో స్టార్ డైరెక్టర్ న్యూ జానర్ మూవీ..?

0
27

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి. ఫస్ట్ మూవీ నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్. మొదటి సినిమా పటాస్ నుండి సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్2 లతో పాటు గతేడాది సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో కామెడీకి ప్రాధాన్యతనిచ్చే దర్శకులలో అనిల్ రావిపూడి ముందువరుసలో ఉంటాడు. ఎందుకంటే తన ప్రతి సినిమాలో కామెడీతో పాటుగా అటు మాస్.. ఇటు క్లాస్ అంశాలతో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్3 మూవీ చేస్తున్నాడు.

2019లో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా మెహరీన్ లను హీరోయిన్లుగా రూపొందించిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్2’. మల్టీస్టారర్ మూవీగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతి బరిలో విడుదలై ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఎఫ్3 రూపొందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ సినిమా కరోనా కారణంగా బ్రేక్ పడింది. అందుకే ఇంటిపట్టునే ఉంటూ స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాడట. అలాగే తదుపరి సినిమాలు కూడా త్వరలో ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట అనిల్.

తాజాగా అనిల్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో సెకండ్ మూవీ పై స్పందించాడు. ఖచ్చితంగా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్. మహేష్ బాబు ఇటీవలే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఓకే చేయడంతో తన స్క్రిప్ట్ కు బ్రేక్ పడిందని అప్పటివరకు స్క్రిప్ట్ డెవలప్ చేసేందుకు టైం ఉంటుందని చెప్పాడట. అయితే అనిల్ -మహేష్ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని తెలియడమే ఆలస్యం సినిమా కథ గురించి పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. ఈసారి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పడంతో ఆసక్తి పెరిగింది. ఈసారి అనిల్ స్క్రిప్ట్ ‘ఒక్కడు’ మూవీ మాదిరిగా క్రికెట్ నేపథ్యంలో సాగనుందని.. ఈ సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తారని టాక్. మరి మహేష్ క్రేజ్ ప్రకారం.. ఈ సబ్జెక్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్ త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాకు ముందా లేక తర్వాత అనేది కొద్దీరోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here