సీటీమార్ ఏమో కానీ దిశాని దించేయాలన్న ఐకన్ స్టార్

0
28

డీజే-దువ్వాడ జగన్నాథం కోసం సీటీ మార్ అంటూ దేవీశ్రీ ఇచ్చిన బీట్ ఎంత సెన్సేషనో తెలిసిందే. ఆ పాటకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పూజా హెగ్డే అద్భుతమైన డ్యాన్సులతో అలరించింది. బన్ని స్టెప్పులకు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఇప్పుడు అదే పాటను బాలీవుడ్ కండల హీరో సల్మాన్ భాయ్ `రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` కోసం దేవీశ్రీ రీమిక్స్ చేయగా సల్మాన్ – దిశా పటానీ జంట అదే రేంజులో అదరగొట్టారన్న టాక్ వచ్చింది.

ఈ పాట రాధే చిత్రానికే హైలైట్ గా నిలవనుంది. దేవీశ్రీని స్వయంగా పిలిచి మళ్లీ ఆ రేంజు సాంగ్ ని ఇచ్చావని  సల్మాన్ భాయ్ పొగిడేశారు. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెడీ చిత్రం నుండి `ధింక చికా..` పాటను కూడా దేవీశ్రీ భాయ్ కి అందించాడు. ఇప్పుడు సీటీమార్ తో మరోమారు భాయ్ మెప్పు పొందాడు. ఈ పాటను షబ్బీర్ అహ్మద్ ఆలపించగా.. కమల్ ఖాన్ – లూలియా వంతూర్ రాశారు.

సీటీమార్ ఏమో కానీ దిశపటానీతో ఓ డాన్స్ నంబర్ చేయించాలని ఇప్పుడు  ఐకాన్ స్టార్ డిసైడ్ అయిపోయారట. రాధేలో దిశా పటానీ గ్లామర్ కంటెంట్ అగ్గి రాజేయనుంది. సీటీమార్ సాంగ్ లో దిశా  డ్యాన్సులకు కుర్రకారు కిర్రెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తన సినిమాలో ఒక ఐటెమ్ నంబర్ కోసం దిశాని బరిలో దించాలని ఐకన్ స్టార్ బన్ని ఫిక్సయిపోయాడట. పుష్పలో హేట్ స్టోరి4 బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ నంబర్ లో మెరిపించనుంది. ఆ తర్వాతి సినిమాలో దిశాకి ఒక ఐటెమ్ నంబర్ ఖాయమైనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here