సినిమాలు కాకుండా స్వీటీ కూడా అదే ఆలోచిస్తుందా..?

0
17

సినీప్రపంచంలో ఎప్పుడు ఏ హీరోయిన్ ఏ స్థాయికి చేరుకుంటుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సినిమాలతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అంటే అందరూ అదృష్టం మాత్రమే నమ్మరు. టాలెంట్ నమ్ముకొని వచ్చేవారు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు. అయితే దశాబ్దం కిందటే కెరీర్ ప్రారంభించి కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ ఓ వయసు వరకు ఆదరించిన అభిమానులే ఇప్పుడు ఓవైపు సినిమాలు చేయాలంటూనే మరోవైపు పెళ్లి ప్రస్తావన తీస్తున్నారు. నిజానికి కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ పెళ్ళెప్పుడు అనే టాపిక్ హల్చల్ చేస్తూనే ఉంది.

అలాంటి పోరును ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు స్వీటీ అలియాస్ అనుష్కశెట్టి. దాదాపు పదిహేను ఏళ్లుగా అనుష్క ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. అలాగే అభిమానంతో పాటు పెళ్లి పుకార్లను కూడా భరిస్తూ వస్తోంది. బాహుబలి వరకు జోరు సాగించిన అనుష్క.. ఆ తరువాత ప్లాప్ లతో సతమతమవుతుంది. బాహుబలి తర్వాత అమ్మడు ఏ హీరో పక్కన నటించలేదు. కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. భాగమతి – నిశ్శబ్దం సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి ఆశించిన ఫలితం తీసుకురాలేదు. కెరీర్ పరంగా ప్రస్తుతం సంధిగ్ధంలో పడిందట అనుష్క. అయితే ఇటీవలే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ రొమాంటిక్ డ్రామా స్టోరీ ఓకే చేసింది.

ఆ సినిమా ప్రారంభం అయ్యేలోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. ప్రస్తుతం మేకర్స్ ఆ సినిమా గురించి పెద్దగా స్పందించడం లేదు. అలాగే అనుష్క కూడా సినిమాల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. కనీసం కొత్తకథలు వింటున్నట్లు కూడా ఎక్కడా ఊసు లేదు. అయితే అనుష్క ఈ మధ్య ఏడాదికి ఒకటంటే ఒకే సినిమాలో కనిపిస్తుంది. మరి ఎందుకు సైలెంట్ అయిపోయిందో తెలియదు. కానీ ఓవైపు పెళ్లి వైపు కూడా ఆలోచనలో ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అందుకే ఇప్పుడేవి కొత్త సినిమాలు ఒప్పుకోలేదని పలు కథనాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని ఇకపై స్వీటిని సినిమాల్లో రెగ్యులర్ గా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి స్వీటీ నుండి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here