సలార్ ‘మసాలా సాంగ్’ కోసం యంగ్ హీరోయిన్..!

0
26

బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఆ తర్వాత సాహో మూవీతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ప్రభాస్ స్టార్డమ్ను సాహో మరోస్థాయికి చేర్చలేకపోయింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా మూవీస్ లైనప్ చూస్తే మాత్రం డార్లింగ్ క్రేజ్ మరో స్టేజికి తీసుకెళ్తాయని నమ్మకం కలుగుతుంది. అందులోను ముఖ్యంగా మాస్ యాక్షన్ మూవీ సలార్ పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే సలార్ తో పాటు ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో ఆదిపురుష్ సినిమాలు లైన్ లో పెట్టేసాడు. ఇటీవలే రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ కూడా కంప్లీట్ చేసాడు.

ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే హీరోలను ప్రశాంత్ నీల్ ఎలా ఎలివేట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ అంశాలతో ఎమోషనల్ సన్నివేశాలతో ప్రశాంత్ హీరోలని చూపించే విధానం హైవోల్టెజ్ తో ఉంటాయని కేజీఎఫ్ సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. మరిప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ తో సినిమా అంటే మినిమమ్ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి.

ఏంటంటే.. సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆల్రెడీ ప్రశాంత్ ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు ఎంపిక చేసాడని టాక్. కానీ తాజాగా అందులో వాస్తవం లేదని.. సలార్ సినిమా స్పెషల్ సాంగ్ లో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధిశెట్టి ఆడిపాడనుందని సినీవర్గాలలో పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ అసలు మసాలా సాంగ్ ఐటమ్ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ తో పాటు సలార్ సినీబృందం కరోనా కారణంగా షూటింగ్ నిలిపేసి ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. శృతిహాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here