సలార్ అప్డేట్.. బాహుబలి తర్వాత మళ్లీ!

0
22

కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా నిలిచిన ప్రశాంత్ నీల్ త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఇప్పటికే ప్రభాస్ హీరోగా పట్టాలెక్కిన విషయం తెల్సిందే. సలార్ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా లో ప్రభాస్ పాత్రపై మొదటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాని మేకర్స్ ఇప్పటి వరకు లుక్ రివీల్ చేశారు తప్ప పాత్ర గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కాని మీడియాలో మాత్రం పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సలార్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ అవుతున్న టాపిక్ ఏంటీ అంటే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాహుబలి సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ప్రభాస్ కనిపించాడు. మళ్లీ సలార్ లో కూడా ప్రభాస్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన రెండు పాత్రలు ఒకదానికి ఒకటి తారస పడలేదు. కాని సలార్ లో మాత్రం ప్రభాస్ పోషించే రెండు పాత్రలు ఎక్కువ పలు సన్నివేశాల్లో కలుస్తాయట. ఒకే సారి ప్రభాస్ ను రెండు విభిన్నమైన గెటప్ ల్లో చూడబోతున్నామన్నమాట.

ఇంకా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రభాస్ ఒక పాత్రలో యంగ్ గా కనిపించనుండగా మరో పాత్రలో కాస్త వయసు అయిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఈ విషయం కనుక నిజం అయితే ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు పండుగే. వచ్చే ఏడాది ఆరంభంలో సలార్ ను విడుదల చేస్తానంటూ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు.  ప్రభాస్ ను రాఖీ భాయ్ ను మించిన మాస్ పాత్రలో చూపిస్తున్నాను అంటూ ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెబుతున్నాడు కనుక సలార్ సినిమా మరో లెవల్ లో ఉండవచ్చు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here