‘సలార్’లో డార్లింగ్ క్యారెక్టర్ పై క్రేజీ న్యూస్..!

0
28

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ పూర్తిచేసి సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ సినిమాగా సలార్ తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తరవాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై భారీ అంచనాలు సెట్ అయిపోయాయి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్కులో కనిపించనున్నట్లు సలార్ పోస్టర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. డార్లింగ్ సరసన శృతి ఫస్ట్ టైం నటిస్తోంది అందుకే వీరి కెమిస్ట్రీ అదిరిపోతుందని టాక్.

అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. ఇంతలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడో అని పలు పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ ఓ యోధుడుగా కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ సాలిడ్ రఫ్ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడని అంటే.. ఈ సినిమాలో కూడా ఓ గతం ఉంటుందని అందులో ఓ రకంగా.. ప్రెసెంట్ ఓ రకమైన క్యారెక్టర్ లో ప్రభాస్ అలరించనున్నట్లు టాక్. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా పూర్తిచేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here