సర్కారు వారి సందడి కూడా లేనట్లేనా?

0
39

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కరోనా కారణంగా షూటింగ్ నిలిపి వేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగకున్నా ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా టీజర్ ను విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీజర్ ను విడుదల చేయడం లేదట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీజర్ విడుదల చేసి సంబురాలు చేసుకోవడం సరికాదని మహేష్ బాబు అండ్ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సర్కారు వారి పాట టీజర్ దాదాపుగా రెడీ అయ్యింది అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. దుబాయిలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన దర్శకుడు ఆ స్టఫ్ తోనే నిమిషం నిడివి ఉన్న టీజర్ ను కట్ చేయించాడట. ఆ టీజర్ కు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని కూడా టాక్ వచ్చింది. టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించేలా కరోనా కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు రావడం జరిగింది. మహేష్ బాబు సూచన మేరకు మేకర్స్ సినిమా టీజర్ ను వాయిదా వేశారట.

ఇటీవల లైగర్ సినిమా టీజర్ ను కూడా వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా లైగర్ ను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా పరిస్థితుల నేపథ్యంలో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కృష్ణ బర్త్ డే సందర్బంగా కూడా సర్కారు వారి పాట టీజర్ మరియు త్రివిక్రమ్ మూవీ టైటిల్ ను రివీల్ చేయబోవడం లేదట. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను మళ్లీ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత పునః ప్రారంభించనున్నారు. త్రివిక్రమ్ మూవీ ని ప్రారంభిస్తారో కూడా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here