‘సర్కారు వారి’ నుండి సాలిడ్ అప్డేట్స్ ఎక్సపెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!

0
24

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ లెన్త్ మాస్ క్లాస్ అంశాలతో ముస్తాబు అవుతోంది. అయితే ఆగష్టులో మహేష్ బాబు బర్త్ డే గురించి ఇప్పటినుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆరోజు కోసం ఫ్యాన్స్ ఏదైనా క్రేజీ అప్డేట్స్ ఉన్నాయేమో అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి సర్కారు వారి పాట టీజర్. ప్రస్తుతం వరుస విజయాలలో ఉన్నటువంటి మహేష్ నుండి రాబోతున్న మోస్ట్ అవెయిటింగ్ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి సర్కార్ నుండి టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అంతకన్నా ముందు సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ తండ్రి పుట్టినరోజు ఉంది. మరి ఆ రోజు కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో అని చూస్తున్నారు.

ఎందుకంటే ఒకవేళ టీజర్ లేదా గ్లింప్స్ లాంటివి మహేష్ పుట్టినరోజుకు రిలీజ్ చేసినా కూడా ముందుగా కృష్ణగారి బర్త్ డే రోజు న్యూ పోస్టర్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. మరోవైపు మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూడోసారి సిద్ధం అవుతోంది. ఇటీవలే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అతడు ఖలేజా మూవీస్ తర్వాత రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగష్టు 9న అధికారికంగా లాంచ్ చేస్తారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. మరి ఈ రెండు క్రేజీ అప్డేట్స్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే పేరు వినిపిస్తుంది.  ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. మైత్రి మూవీస్ 14 రీల్స్ తో పాటు మహేష్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here