‘సర్కారు..’ లో కీర్తి సురేష్ పాత్ర ఇదే?

0
18

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం కరోనా సమస్యలతో  సెకండ్ షెడ్యూల్ తర్వాత బ్రేక్ పడింది. అయితేనేం ఈ సినిమా మీద వచ్చే వార్తలకు బ్రేక్ పడటం లేదు. అదీ సూపర్ స్టార్ స్టామినా. ఈ సినిమా కథేంటి..మహేష్ క్యారక్టర్ ఏమిటి…కీర్తి సురేష్ ఏం చేస్తుంది అంటూ రకరకాల కథలువ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ మహేష్ క్యారెక్టర్ విషయమై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా సర్కారు వారి పాట ఫస్టాఫ్ సెకండాఫ్లలో కీర్తి సురేష్ రోల్ ఎలా ఉంటుందనే దానిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అందుతున్న  సమాచారం మేరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా నడుస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువే. అలాగే ఈ సినిమాలో ఆమె పాత్ర మహేష్ బాబుకు సబార్డనేట్ గా కనిపిస్తుంది అంటున్నారు. బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. సోషల్ మెసేజ్తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ  బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తాడట. అదే బ్యాంక్ లో ఉద్యోగినిగా కీర్తి సురేష్ కనిపిస్తుందిట. ఇక కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్గా తీర్చిదిద్దుతున్నారని టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహేశ్ ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here