సమంత బోల్డ్ ‘వెబ్ సిరీస్’ రిలీజ్ డేట్..?

0
18

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తుందనే విషయాలు పక్కనపెడితే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు సమంతను వెబ్ సిరీస్ లో చూస్తామో అని ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు. సమంత ఇన్నేళ్ల కెరీర్ లో ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. 2019లో సూపర్ హిట్ అయినటువంటి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2’ తెరకెక్కింది. నిజానికి ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమ్ కావాల్సింది.

కానీ కొన్ని కారణాల వలన ఈ వెబ్ సిరీస్ వాయిదాపడింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ మోస్ట్ అవెయిటింగ్ “ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` స్ట్రీమింగ్ డేట్ లాక్ అయిందని తెలుస్తుంది. మొత్తానికి జూన్ 11న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్. మొదటి సీజన్ లో నటించిన మనోజ్ బాజపేయ్ ప్రియమణితో సహా పలువురు సీజన్ 2 లో కొనసాగనున్నారు. సమంత విషయానికి వస్తే రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రలో నెగటివ్ షేడ్స్ తో అలరించేందుకు రెడీ అయిపోయింది.

కానీ కొన్ని కారణాల వలన ఈ వెబ్ సిరీస్ వాయిదాపడింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ మోస్ట్ అవెయిటింగ్ “ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` స్ట్రీమింగ్ డేట్ లాక్ అయిందని తెలుస్తుంది. మొత్తానికి జూన్ 11న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్. మొదటి సీజన్ లో నటించిన మనోజ్ బాజపేయ్ ప్రియమణితో సహా పలువురు సీసన్ 2లో కొనసాగనున్నారు. సమంత విషయానికి వస్తే రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రలో నెగటివ్ షేడ్స్ తో అలరించేందుకు రెడీ అయిపోయింది.

ఇదిలా ఉండగా.. అసలు సమంత ఈ వెబ్ సిరీస్ లో ఎలా సెట్ అయిందని చాలామందికి సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ తాజాగా డైరెక్టర్స్ రాజ్ – డికే క్లారిటీ ఇచ్చారు. సమంత ఈ వెబ్ సిరీస్ లో ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసిందని వారు చెప్పారు. ఈ క్యారెక్టర్ కోసం సౌత్ యాక్ట్రెస్ కావాలని చూస్తున్న సమయంలో సూపర్ డీలక్స్ సినిమా చూసాం. అందులో సమంత యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాం. ఆ వెంటనే సమంతను కలిసి స్టోరీ వినిపించాము. ఆమె రియాక్షన్ ఇవ్వలేదు కానీ సానుకూలంగా స్పందించింది. ఈ వెబ్ సిరీస్ లో సమంతను చాలా బోల్డ్ లుక్కు అండ్ యాక్షన్ లో చూడబోతున్నారు. ఆమె మాత్రం తన పాత్ర మేరకు ది బెస్ట్ ఇచ్చిందని చెప్పగలము” అని చెప్పారు డైరెక్టర్స్. ఇక ప్రస్తుతం సమంత గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీతో పాటు ‘కాతువకుల రెండు కాదల్’ సినిమాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here