‘సంచారి’ గా రాబోతున్న పవర్ స్టార్..?

0
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో మరో సినిమా వస్తుందని తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ‘#PSPK28’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని గురించి రెగ్యులర్ గా ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది.

పవన్ – హరీష్ కాంబోలో రాబోతున్న సినిమాకి ”సంచారి” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఆసక్తిని కలిగించిన హరీష్.. ఇప్పుడు ‘సంచారి’ అనే టైటిల్ ని పెడుతున్నాడంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆలోచించడం మొదలుపెట్టారు. పవన్ బర్త్ డే నాడు వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఇండియా గేట్ ని చూపిస్తూ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ ఫోటోలు.. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష – గులాబీ పువ్వును పెట్టి ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

మొత్తం మీద పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. ‘గబ్బర్ సింగ్’ త్రయం కలిసి చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ మరియు ‘హరి హర వీరమల్లు’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే హరీష్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here