సంక్రాంతికి టాలీవుడ్ భీకర పోరు.. ఒకేసారి 10 మంది హీరోలతో బాక్సాఫీస్ ఫైట్.. వెయ్యికోట్ల బిజినెస్!

0
18

ఒకేసారి పెద్ద సినిమాలు వస్తే బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా సంక్రాంతి అనగానే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ పోటీకి సిద్ధమవుతుంటారు. గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా చతికిల బడిన బాక్సాఫీస్ పరిస్థితులు బాగా ఉంటే ఈ ఏడాది భారీ పోటీని తారల మధ్య, నిర్మాతలు, దర్శకుల మధ్య పెట్టే అవకాశం ఉంది. అయితే కరోనావైరస్ పరిస్థితులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ఆసక్తిగా మారింది. అయితే తాజా రిపోర్టు ప్రకారం.. అయితే గతంలో ఎన్నడు చూడని సంక్రాంతి పోరును 2022కి చూడబోతున్నారని చెప్పవచ్చు. ఒకేసారి 10 మంది హీరోలతో వెయ్యికోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఇది భారీ రిస్క్ అయినప్పటికీ కొందరికి తప్పడం లేదు.

10 మంది హీరోలు

కరోనా దెబ్బ కొట్టడం వలన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రిలీజ్ డేట్స్ పై యుద్ధాలు మొదలయ్యేయి. పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయో లేదో తెలియదు గాని పెద్ద సినిమాలు వస్తే మాత్రం కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపడం పక్కా. 2022 సంక్రాంతి ఫైట్ కు ఆల్ మోస్ట్ 6 సినిమాలు పోటీకి సిద్ధం కాగా అందులో 10 మంది హీరోలు ఉండడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిన. ఈ ఏడాది సమ్మర్ లోనే రావాల్సిన ఈ సినిమా కరోనా వలన మూడుసార్లు వాయిదా పడింది. ఇక ఇప్పుడు మరోసారి వాయిదా పడక తప్పడం లేదు. దీంతో దర్శకుడు కొరటాల సినిమాను వచ్చే సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది.

ప్రభాస్ రాధేశ్యామ్

రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఇటీవల రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 14న విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్ట్ లేదా అక్టోబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికి నిర్మాతలకు మరో దారి దొరకలేదు. రిస్క్ చేయడం ఇష్టం లేక సేఫ్ జోన్ లో సంక్రాంతి బరిలో దించుతున్నారు.

పవన్ కళ్యాణ్ – రానా

పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ జనవరి 12న రానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పోటీని ఇవ్వగలదని అర్ధమవుతోంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13 రానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దని ఎదుర్కోనుంది. ముందు పవన్ కళ్యాణ్ ఆ తరువాత ప్రభాస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వీరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం అయితే ముందే ఫిక్స్ అయ్యింది.

వెంకటేష్ – వరుణ్ తేజ్

ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రానా, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. ఈ పేర్లు వింటేనే బాక్సాఫీస్ గుండెల్లో గుబులు పుట్టడం కాయం. ఇప్పటికే పోటీ తీవ్రత చాలా ఎక్కువైంది. ఇక ఈ సమరంలో ఎవరు వచ్చినా కూడా తట్టుకోవడం కష్టం అలాంటిది F3తో వెంకటేష్ – వరుణ్ తేజ్ పోటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోలీవుడ్ హీరో విజయ్ బీస్ట్ కూడా తెలుగులో భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

నాగార్జున – నాగ చైతన్య

ఇక మరోవైపు నాగార్జున – నాగ చైతన్య కూడా సంక్రాంతి పోటీకి సై అంటున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా రానున్న బంగార్రాజు సినిమాలో తండ్రి కొడుకులు మరోసారి కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతి సెంటిమెంట్ ను నమ్ముకోవడంతో సంక్రాంతి ఫైట్ లో మొత్తం 10 మంది హీరోలు తయారయ్యారు. మరి ఎవరు ఏ స్థాయిలో సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here