శంకర్ మార్క్ సాంగ్ తో చరణ్ షురూ

0
17

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రూపొందబోతుంది. దిల్ రాజు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా దర్శకుడు శంకర్ హైదరాబాద్ లోనే ఉంటూ షూటింగ్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు. నటీ నటుల ఎంపిక మొదలుకుని లొకేషన్స్ అన్వేషణ మరియు సెట్టింగ్స్ నిర్మాణం వరకు అన్ని విషయాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో నటించేందుకు చరణ్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి తర్వాత వెంటనే అదే స్థాయి దర్శకుడు శంకర్ తో సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలు అవుతుందో అంటూ చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చరణ్ పై సాంగ్ చిత్రీకరణ తో షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నాడు. శంకర్ సినిమాలోని పాటలకు కోట్లల్లో ఖర్చు చేస్తూ ఉంటారు. సినిమాలో ఒక్కటి రెండు పాటలు అయినా కూడా కళ్లు మిరిమిట్లు గొలిపే సెట్ లో చిత్రీకరిస్తున్నారు. అలాగే చరణ్ మూవీ కోసం కూడా అలాంటి ఒక సెట్టింగ్ ను వేయించాడట. ఆ సెట్టింగ్ లో చరణ్ పై ఆ పాటను చిత్రీకరించబోతున్నాడు.

పాట లో చరణ్ తో పాటు హీరోయిన్ కూడా పాల్గొంటుందా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో ఏ క్షణంలో అయినా శంకర్ దర్శకత్వంలో చరణ్ మూవీ సాంగ్ షూటింగ్ ప్రారంభం అవ్వొచ్చు అంటున్నారు. భారీ ఎత్తున డాన్సర్స్ తో పాటు హై టెక్నికల్ టీమ్ తో పాట చిత్రీకరణ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. మొదటి పాటకు గాను జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నాడు. థమన్ నుండి అద్బుతమైన ఒక మాస్ బీట్ సాంగ్ ఇప్పటికే శంకర్ తీసుకున్నాడు.. దానికి తన మార్క్ కు తగ్గట్లుగా మార్పులు చేయించుకుని రెడీ చేయించాడట.

ప్రస్తుతం ఆ పాట రికార్డింగ్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించబోతున్న నేపథ్యంలో సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇది ఒక కమర్షియల్ సోషల్ మెసేజ్ మూవీ అంటున్నారు. ఒక మద్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో అనూహ్యంగా సీఎం అవ్వడం.. తర్వాత అతడు తీసుకు వచ్చిన మార్పులను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

కథ విషయమై యూనిట్ సభ్యుల నుండి స్పష్టత రావాల్సి ఉంది. సినిమాలో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయంలో పలు పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఎవరికి ఫైనల్ చేస్తారు అనేది చూడాలి. శంకర్ మార్క్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here