‘శంకర్ – చరణ్’ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో..?

0
19

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ‘RC15’ ప్రాజెక్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. సినిమా నేపథ్యం ఇదని.. ఇందులో హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారని.. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

RC15′ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని.. మెయిన్ రోల్ కానప్పటికీ హీరోకి ధీటుగా నిలిచే క్యారక్టర్ అని.. కీలకమైన ఆ పాత్రలో స్టార్ హీరోని నటింపజేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో శంకర్ – చరణ్ లతో ఉన్న పరిచయాలతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. సల్మాన్ అయితే పాన్ ఇండియా మార్కెట్ కు ప్లస్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దీని కోసం 25 నుంచి 30 రోజుల డేట్స్ అవసరమవుతుందని అంటున్నారు. మరి చరణ్ సినిమాలో నటించడానికి సల్మాన్ ఖాన్ అంగీకరిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం శంకర్ డైరెక్షన్ లో చరణ్ – సల్మాన్ డ్రీమ్ కాంబో అని చెప్పవచ్చు. ఇకపోతే సల్మాన్ ఒప్పుకోకపోయినా ఎవరో ఒకరు స్టార్ హీరోతోనే ఆ పాత్రను చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

కాగా ‘RC15’ శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో కూడిన యాక్షన్ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులతో పాటుగా నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మరియు ‘ఆచార్య’ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జూన్ నెలలో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here