‘శంకర్-చరణ్’ ప్రాజెక్ట్ లో ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు..?

0
19

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజూ ఏదొక న్యూస్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో రూపొందే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఐదు ప్రధాన భాషలకి చెందిన ఐదుగురు స్టార్ హీరోలను నటింప చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తాజాగా ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో ‘#RC15’ కన్నడ వెర్షన్ కి సంబంధించి కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని ఆ రోల్ కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ‘రక్త చరిత్ర’ ‘ఈగ’ ‘బాహుబలి’ ‘సైరా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సుదీప్.. ఇప్పుడు చరణ్ సినిమాలో నటించంచనున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అలానే అదే పాత్ర కోసం తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ లను సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. తెలుగు వెర్షన్ లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరో నటిస్తారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here