వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ కూతురు.. బడా బ్యానర్ లో అల్లు అర్హ

0
10

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సినీ వారసులు చాలామంది ఉన్నారు. అయితే అందులో అబ్నాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అది కూడా ఒక బడా నిర్మాతతో చేయబోతున్నట్లు సమాచారం.

ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా

అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఎన్నో ఫ్యాన్ పేజెస్ కూడా జన్నాయి. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా తల్లి స్నేహా రెడ్డి పిల్లలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.

అందరిని డామినేట్ చేసేలా

అల్లు అయాన్ కాస్త తక్కువగానే హైలెట్ అయినప్పటికీ అర్హ మాత్రం అందరిని డామినేట్ చేసేలా స్టిల్స్ ఇస్తోంది. అల్లు అర్జున్ ను కూడా చాలాసార్లు ప్రేమగా తిట్టిన వీడియోలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అంతే కాకుండా ఆ మధ్య పుట్టినరోజు సందర్భంగా అంజలి అంజలి సాంగ్ కూడా షూట్ చేయగా అందులో అర్హ చాలా క్యూట్ గా యాక్ట్ చేసింది.

అల్లు అర్హ వెండితెర ఎంట్రీ

ఇక ప్రస్తుతం మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్హ వెండితెరపై కూడా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. నిర్మాత దిల్ రాజు సురేష్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తిగా కిడ్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కుతుందట. ఇక అల్లు అర్హ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అల్లు అయాన్ కూడా?

అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఆ సినిమాలో ఉంటాడా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి న్యూస్ లేదు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు 80% పూర్తయ్యింది. ఇక ఆ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here