‘విరాటపర్వం’ చిత్రాన్ని ఏ వేదికపై రిలీజ్ చేస్తారో..!

0
18

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి – సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ”విరాట పర్వం”. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. ‘నీది నాది ఒకటే కథ’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమా తర్వాత వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.1990 నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎప్పుడు రిలీజైనా మంచి కలెక్షన్స్ వస్తాయని డైరెక్టర్ నమ్ముతున్నారు. అయితే రానా మాత్రం ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.

అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో విడుదల చేస్తే మంచి ఆదరణ దక్కించుకుంటుందని రానా దగ్గుబాటి ఆలోచిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కాగా ‘విరాటపర్వం’ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి – నివేథా పేతురాజ్ – నందితా దాస్ – నవీన్ చంద్ర – ఈశ్వరీరావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. డానీ సాంచెజ్ లోపెజ్ – దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ దీనికి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here