‘వకీల్ సాబ్ 2’ కి ప్రయత్నాలు జరుగుతున్నాయా..?

0
35

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వచ్చిన ‘వకీల్ సాబ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. మూడు వారాలు థియేటర్స్ లో ప్రదర్శించబడిన ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాని డీల్ చేసిన విధానం నచ్చి వేణు శ్రీరామ్ కు పవన్ మరో అవకాశం ఇచ్చాడని.. దిల్ రాజు కూడా పవన్ కు ఇంకో చిత్రానికి అడ్వాన్స్ ఇచ్చారని టాక్ వినిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ – శ్రీరామ్ వేణు – దిల్ రాజు కాంబినేషన్ లో ‘వకీల్ సాబ్ 2’ అనే న్యూస్ తెరపైకి వచ్చింది.

‘వకీల్ సాబ్’ క్యారక్టర్ తీసుకొని ఈ చిత్రానికి సీక్వెల్ సినిమా చేస్తే బాగుంటుందని పవర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ సైతం ‘వకీల్ సాబ్-2’ ఉంటుందని హింట్ ఇచ్చారు. సీక్వెల్ చేయాలనే ఆలోచన ముందుగా తనకు రాలేదని.. కానీ చాలామంది తనను ‘వకీల్ సాబ్’ కు సీక్వెల్ చేయమని అడుగుతున్నారని వేణు శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ళు అడిగిన తర్వాత కొత్త ఆలోచన వచ్చిందని.. వకీల్ సాబ్ ఎవరనేది ఫిక్స్ కాబట్టి మంచి స్టోరీ రెడీ చేయాలని దర్శకుడు తెలిపారు.

‘పింక్’ రీమేక్ గా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు నేపథ్యంలో కోర్టు డ్రామాగా ‘వకీల్ సాబ్’ సినిమా రూపొందింది. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని వేణు శ్రీరామ్ కొన్ని కమర్షియల్ హంగులు జత చేసాడు. ఒకవేళ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సీక్వెల్ తీసే అవకాశం వస్తే చేయగలనని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వేణు. మరి రాబోయే రోజుల్లో ‘వకీల్ సాబ్ 2’ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here