వకీల్ సాబ్ బాధ్యత సుబ్బారెడ్డిపై పెట్టిన దిల్ రాజు

0
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఆరు షోల కోసం తెలంగాణ సర్కార్ ను ఒప్పించిన నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఏపీ సర్కార్ ను ఒప్పించే బాధ్యతను తన సన్నిహితుడైన వైసీపీ సీనియర్ పై పెట్టాడట.. జగన్ సొంత బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డితో ఈ మేరకు లాబీయింగ్ మొదలు పెట్టాడని టాక్.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో నిర్మాత దిల్ రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయట.. వైసీపీ ఎమ్మెల్యేలతోనూ దిల్ రాజుకు బంధుత్వాలు ఉన్నాయి. దీంతో వకీల్ సాబ్ మూవీ ఆరు షోల కోసం దిల్ రాజు జగన్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారట..

ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. సీఎం జగన్ ను వైసీపీ ప్రభుత్వాన్ని పులివెందుల రాజకీయాలపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. పవన్ సినిమా ‘వకీల్ సాబ్’కు అనుమతి వస్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఎలాగైనా సరే అనుమతి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు. బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here