వకీల్ సాబ్ పై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉండనుందా?

0
14

పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా కారణంగా గత ఏడాది రావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యింది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లి పోయాడు. మళ్లీ సినిమాలు చేయక పోవచ్చు అనుకుంటున్న సమయంలో ఆర్థిక అవసరాల నిమిత్తం అంటూ వరుసగా సినిమాలు కమిట్ అయ్యాడు. మొదటగా పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పవన్ రెడీ అయ్యాడు. మొన్నటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్లుగా అనిపించినా గడచిన రెండు మూడు వారాల నుండి కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇటీవల 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దాంతో మళ్లీ కరోనా ఆందోళన జనాల్లో కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న సమయంలో రాబోతున్న వకీల్ సాబ్ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీ ఎత్తున నమోదు అవ్వడం ఖాయం. ఫ్యాన్స్ షో లు మొదటి రోజు ఆటలతో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయి. రెండవ రోజు నుండి వసూళ్లు రావాలంటే సాదారణ ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టాలి. చిన్న పిల్లలు పెద్ద వారితో ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటుంది. సాదారణ పరిస్థితుల్లో అయితే రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా పవన్ సినిమా కనుక ఫలితం తో సంబంధం లేకుండా చూద్దాం అనుకునే వారు చాలా మంది ఉంటారు. కాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లాలంటేనే అవసరమా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా సాదా సీదాగా ఉంటే మొదటి రోజు ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సిందే అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చి పర్వాలేదు చూడవచ్చు అంటూ మౌత్ టాక్ వస్తే ఖచ్చితంగా జనాలు కరోనా భయంను పక్కన పెట్టి సినిమాను చూసేందుకు వస్తారు. సినిమా బాగాలేకుంటే మాత్రం ఈ కరోనా టైమ్ లో రిస్క్ తీసుకుని బాగాలేని సినిమాకు ఎందుకు వెళ్లడం బాబు అనుకుంటూ ఇంట్లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. సో వకీల్ సాబ్ సినిమా పై కరోనా ప్రభావం ఉంటుందా ఉండదా అనే విషయం సినిమా ఫలితాన్ని బట్టి తేలనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఎక్కడ విడుదల అయితే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ వీర లెవల్ ల్లో జరుగుతోంది. సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు ఖాయం అంటున్నారు. అభిమానులు నాన్ బాహుబలి రికార్డు కొట్టడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here