‘వకీల్ సాబ్’లో ఆ 25 నిముషాలు ప్లస్ అవుతాయా..?

0
14

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. అలాగే వకీల్ సాబ్ మూవీ నిడివి 2గంటల 35 నిముషాలు. కాగా ఇలాంటి జానర్ లో 155నిముషాల నిడివి చాలా ఎక్కువని టాక్ వినిపిస్తుంది. అయితే వకీల్ సాబ్ హిందీ పింక్ మూవీకి రీమేక్ అనేది విదితమే. కానీ ఒరిజినల్ పింక్ సినిమా డ్యూరేషన్ చూసినట్లయితే 130నిముషాలు మాత్రమే. మరి వకీల్ సాబ్ సినిమాను ఒరిజినల్ డిస్టర్బ్ కాకుండా తెరకెక్కించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఎక్సట్రా 25నిముషాలు నిడివి ఎందుకోసం పెంచారంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఉండనుంది. వారి లవ్ ట్రాక్ కూడా బాగుంటుందని అంటున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ఆ ఎక్సట్రా 25నిముషాలు సినిమా ఫలితాన్ని నిర్ణయించగలవని మేకర్స్ అంటున్నారట. పింక్ మూవీ 130 నిమిషాలు ఆద్యంతం స్టోరీ వైపు నడిపిస్తుంది. మరి వకీల్ సాబ్ 155 నిముషాలు అంటే అంతసేపు ప్రేక్షకులను సీట్ లో కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా పింక్ సోల్ పోకుండా చూడాలి. పింక్ ఎమోషన్స్ హృద్యమైన భావనాలను వకీల్ సాబ్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా.. మరోవైపు వకీల్ సాబ్ స్పెషల్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం నుండే ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాయి. కానీ కోవిడ్ కారణంగా హైదరాబాద్ లో మాత్రం స్పెషల్ షోస్ ఉండవని టాక్. ఏప్రిల్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 50% అక్క్యూపెన్సి గురించి ప్రభుత్వాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని వకీల్ మేకర్స్ ఆలోచనలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here