రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు.. రిలీజే మిగిలింది..!

0
13

నేచురల్ స్టార్ నాని చేతినిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే హీరో. మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతల హీరోగా పిలవబడే నాని డేట్స్ కోసం ఫిల్మ్ మేకర్స్ క్యూలు కడుతుంటారు. ఇప్పటికే ‘టక్ జగదీష్’ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి పంపించాడు. అంతేకాదు ‘అంటే.. సుందరానికీ!’ సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ సినిమాని ఎప్పుడో పూర్తి చేశారు నాని. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని నిర్మించారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ తో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని మొదలు పెట్టాడు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ‘శ్యామ్ సింగ రాయ్’ రూపొందుతోంది. నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారానికి కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా నాని ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘మనకు వచింది ఒకటే.. సినిమా.. కొత్త ప్రయాణంలో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇందులో నాని తన మీసాలను ట్రిమ్ చేసుకొని తన నెక్స్ట్ సినిమా ‘అంటే సుందరానికి’ కోసం రెడీ అవుతున్నట్లు తెలిపారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ నజ్రియా మీద సన్నివేశాలను చిత్రీకరించగా.. నాని కూడా తిరిగి సెట్స్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగ..’ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి అయితే మాత్రం నాని నుంచి చాలా తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నాని మార్కెట్ కి పెద్ద సవాలనే చెప్పాలి.

ఇకపోతే గతేడాది థియేటర్స్ లో విడుదల కావాల్సిన ‘వి’ సినిమా.. కరోనా పరిస్థితుల కారణంగా భారీ ఎక్స్ పెక్సేటషన్స్ తో ఓటీటీలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఓటిటి రిలీజులుని నాని పెద్దగా ఇష్టపడటం లేదట. అందుకే ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ‘టక్ జగదీష్’ చిత్రానికి మంచి ఓటిటి ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేస్తూ వస్తున్నారని టాక్. ఇప్పుడు నాని నుంచి ఒకటికి రెండు సినిమాకు విడుదలకు సిద్దం అవుతున్నాయి. మరి రెంటినీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here