రెంట్ కట్టలేక రెండు కోట్ల సెట్ తీసేసారు..!

0
20

మధ్యకాలంలో సినిమాలు షూటింగ్స్ నిలిచిపోవడం కారణంగా మేకర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షూటింగ్ జరిగినా జరగకపోయినా చెల్లించాల్సిన పైకం అయితే చెల్లించాల్సి ఉంటుంది. భారీగా ప్లాన్ చేసిన సినిమాలు కరోనా కారణంగా ఎక్కడివక్కడే ఆగిపోయే సరికి ఆ బర్డెన్ అంతా ప్రొడ్యూసర్స్ పై పడుతుంది. నిజానికి ఓ మూవీ సెట్ వేసాక ఏ విధంగా షూటింగ్స్ జరగకపోయినా వాటి రెంట్స్ మాత్రం పే చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. అసలే ఓవైపు ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. వేరే రాష్ట్రాలలో కంటే కూడా ముంబైలోనే పరిస్థితి దారుణంగా ఉంది.

అయితే ఓవైపు జనాలే సరిగా జీవించలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో సినిమాలు షూటింగ్స్ అనేవి అసలే సాధ్యం కావు. కానీ ఎంతో గ్రాండ్ గా షూటింగ్ జరుపుకోవాలని వేసుకున్న సినిమా సెట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. వాటికీ కిరాయిలు చెల్లించలేక నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఓవైపు సెట్ వేసిన నష్టమే భారంగా అనిపిస్తుంటే మరోవైపు రెంట్స్ పే చేయాలంటే అదనపు భారమే అని చెప్పాలి. తాజాగా ఇలాంటి అదనపు భారం భరించలేక బాలీవుడ్ చిత్రబృందం 2కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన సెట్ తీసేయాలని నిర్ణయించుకున్నారట. స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ – సిద్దార్థ్ మల్హోత్రా – రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ‘థాంక్ గాడ్’ అనే సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ సినిమా జనవరి నెలలో షూట్ మొదలైందో లేదో అప్పుడే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్స్ నిలుపుకొని ఇంటిపట్టునే ఉంటున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో సెట్ వేసేసరికి రెంట్ ద్వారా అదనపు భారం పెరుగుతుందని నిర్మాతలు సెట్ తీసేసారట. రోజుల వారీగా రెంట్ పెరిగుతూనే ఉంది కానీ షూటింగ్స్ మాత్రం సాధ్యం అయ్యే పనికాదని నిర్మాతలు ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే రకుల్ కు ఇటు సిద్దార్థ్ తో అటు అజయ్ తో మూడో సినిమా కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here