‘రాధేశ్యామ్’ విషయంలో స్టార్ హీరోయిన్ కంగారు పడుతోందా..?

0
40

సినీఇండస్ట్రీలో హీరోలు గాని హీరోయిన్స్ గాని ఒకసారి ఓ సినిమాకు డేట్స్ కేటాయించారు అంటే ఖచ్చితంగా ఆ అగ్రిమెంట్ కు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఎంతమేరకు స్ట్రిక్ట్ గా ఉందో తెలియదు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో విపత్తు వచ్చి లేదా ఆరోగ్యం విషయంలో తేడా కొడితే తప్ప డేట్స్ వాయిదా వేయడం సాధ్యం కాదు. అయితే అప్పుడప్పుడు డేట్స్ విషయంలో నానా తంటాలు పడుతుంటారు హీరోయిన్స్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పరిస్థితి అలాగే ఉందట. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్స్ లో పూజా ఒకరు. గ్యాప్ లేకుండా ఓవైపు సౌత్ సినిమాలు మరోవైపు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది.

ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చి పూజా ప్లాన్స్ షెడ్యూల్స్ అన్ని తారుమారు చేసేసిందట. కేవలం పూజా విషయంలోనే కాదు టోటల్ ఇండస్ట్రీ స్టార్స్ విషయంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపించింది. అయితే ఇదివరకు కేటాయించిన డేట్స్ అన్ని ఇప్పుడు లాక్డౌన్ లోనే అయిపోతున్నాయి. మరోవైపు సినిమా షూటింగ్స్ జరగడం లేదు. అలాగే ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభం అవుతాయో కూడా తెలియదు. కానీ అమ్మడు పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమా విషయంలో కంగారు పడుతున్నట్లు టాక్. ఎందుకంటే రాధేశ్యామ్ ఓ స్మాల్ షెడ్యూల్ ఇటీవలే ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ షెడ్యూల్ కోసమే పూజా కొన్ని డేట్స్ కేటాయించిందట. రాధేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. అలాగే మిగతా సినిమాలు కూడా షూటింగ్స్ నిలుపుకొని ఉన్నాయి. మరి త్వరలో కరోనా ప్రభావం తగ్గితే మళ్లీ షూటింగ్స్ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాధేశ్యామ్ డేట్స్ అయిపోయాయని.. ప్రస్తుతం పూజాహెగ్డే డేట్స్ అన్ని బాలీవుడ్ యష్ రాజ్ ఫిలిమ్స్ కు కేటాయించిందని సమాచారం. బాలీవుడ్ వర్గాలలో ఒకసారి కమిట్ అయితే డేట్స్ అయిపోయే వరకు వేరే సినిమాలకు కేటాయించరాదట. మరి ఒకవేళ షూటింగ్స్ స్టార్ట్ అయినా కూడా పూజా ఫస్ట్ బాలీవుడ్ మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి డేట్స్ అన్ని బాలీవుడ్ సినిమాలకు కేటాయించింది అంటే రాధేశ్యామ్ కు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. మరి పూజా ఏం చేయనుందో చూడాలి. ప్రస్తుతం అమ్మడి చేతిలో రాధేశ్యామ్ – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – ఆచార్య – దళపతి 65 – కబీ ఈద్ కబీ దీవాలి – సర్కస్ సినిమాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here