‘రాధేశ్యామ్’ రీ షూట్ పుకార్లు.. అసలు విషయం ఏంటి?

0
26

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమా గురించి ఇటీవల అనేక వార్తలు సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమా లోని కొన్ని ఇటలీ సన్నివేశాలను రీ షూట్ చయబోతున్నారని కొందరు.. ఇటలీ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇటలీ వెళ్లి చిత్రీకరించే అవకాశం లేని కారణంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ను భారీగా ఉపయోగిస్తున్నారనేది కూడా పుకారు. మొత్తానికి అనేక పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో రాధే శ్యామ్ అసలేం జరుగుతోంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ విషయమై జరుగుతున్న ప్రచారం పూర్తి గా నిజం కాదని.. కాని సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల కోసం ఇంకా కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందట. పీరియాడిక్ మూవీ అవ్వడం వల్ల సహజంగానే కాస్త ఎక్కువ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయి. రాధే శ్యామ్ లో కాస్త ఎక్కువ సన్నివేశాలు వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉన్నాయంటున్నారు. ఇక రీ షూట్ విషయం కూడా నిజం కాదనే సమాచారం యూవీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా ను రెండు మూడు వారాల్లో పూర్తి చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అవుతోంది.

సాహో సినిమా విడుదలకు ముందే రాధే శ్యామ్ షూటింగ్ ను మొదలు పెట్టారు. కాని ఏదో ఒక కారణం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. గత ఏడాదిలోనే ఈ సినిమా ను విడుదల చేయాలని భావించారు. కాని కరోనా వల్ల ఈ ఏడాది జులై కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఖచ్చితంగా రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here