రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు

0
20

అశ్లీల వీడియోలు తీసి యాప్స్ లో అప్ లోడ్ చేయించారని ఆరోపణలతో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు దాపురించాయి.  తాజాగా ఈరోజుతో రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ ముగిసింది. కానీ  ఈరోజు విచారణలో కోర్టు రాజ్ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. మరికొన్ని రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి పంపించింది.

మంగళవారం వీరి బెయిల్ పై విచారించిన కోర్టు రాజ్ కుంద్రా ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త జూలై 19న అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యాడు. జూలై 23న క్రైం బ్రాంచ్ ముంబైలోని అంథేరిలోని రాజ్ కుంద్రా‘వియాన్ ఇండస్ట్రీస్’ కార్యాలయంపై దాడి చేసి దాచిన అల్మారాను కనుగొన్నారు. ఇందులో ఆర్థిక లావాదేవీలు క్రిప్టో కరెన్సీ గురించి అనేక పత్రాలు ఉన్నాయి.

ఇక పోలీసులు విచారణలో భాగంగా రాజ్ శిల్పాశెట్టి జుహు బంగ్లాపై కూడా పోలీసులు దాడి చేశారు. శిల్పాను కూడా పోలీసులు ప్రశ్నించారు. హాట్ షాట్స్ కంటెంట్ గురించి తనకు తెలియదని శిల్పా స్టేట్ మెంట్ లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వివాదాస్పద కేసులో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 48 టీబీ డేటాను యాక్సిస్ చేయగలిగారు. రాజ్ కుంద్రా సూచనల మేరకు ఈ కేసు దాఖలు చేసిన తర్వాత భారీగా డేటా తొలగించబడిందని పోలీసులు తెలిపారు.

ఇక ఈ అశ్లీల వీడియోల కేసులో రాజ్ కుంద్రా పాత్రను తేల్చేందుకు బ్రిటన్ నుంచి వీడియోలు అప్ లోడ్.. మనీ ల్యాండరింగ్ దృష్ట్యా ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది.  రాజ్ కుంద్రా మెర్క్యూరీ ఇంటర్నేషన్ కంపెనీ (ఆన్ లైన్ బెట్టింగ్ మరియు క్యాసినో గేమింగ్) దక్షిణాఫ్రికా బ్యాంక్ ఖాతా మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు పోలీసులు కనుగొన్న దృష్ట్యా ఈ కేసులో ఈడీ కూడా విచారణ జరుపబోతున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here