రాజశేఖర్ – గోపీచంద్ కాంబోలో మల్టీస్టారర్..?

0
23

టాలీవుడ్ లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈగోలు – స్క్రీన్ స్పేస్ వంటి అంశాలని పక్కనపెట్టి ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. అలానే ‘అయ్యప్పనుమ్ కోశీయుమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీటితో పాటుగా పలు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు సెట్స్ పై ఉండగా.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ వంటి మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.

సీనియర్ హీరో యాంగ్రీస్టార్ డా.రాజశేఖర్ – యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ‘లక్ష్యం’ ‘లౌక్యం’ ‘డిక్టేటర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీవాస్.. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇకపోతే గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘లక్ష్యం’ ‘లౌక్యం’ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు రాజశేఖర్ తో కలిసి వస్తున్న ఈ సక్సెస్ ఫుల్ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తుండగా.. రాజశేఖర్ ‘శేఖర్’ ‘RS92’ ‘మర్మాణువు’ అనే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here