రాజమౌళి ఏం చేస్తాడో?

0
22

సెకండ్ వేవ్ ప్రభావం ఊహించిన దానికన్నా బాగా ఎక్కువే అని అందరికీ అర్దమైంది. దాంతో సినిమావాళ్లు తమ ప్లాన్స్ ను పూర్తి స్దాయిలో మార్చుకోవటానికి సిద్దపబడుతున్నారు. రిలీజ్ లు వాయిదా వేసుకుటున్నారు. షూటింగ్ లు కూడా ఏమి జరగటం లేదు. చిన్న సినిమాలు సంగతి ఎలా పెద్ద వాడిపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం రిలీజ్ డేట్స్ డిస్ట్రబ్ అవుతున్నాయి. దాంతో కొత్త రిలీజ్ డేట్స్ వెతకాల్సిన సిట్యువేషన్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాదీ అదే పరిస్దితి.

భారీ ఖర్చుతో ముడిపడిన సినిమా కావటం మల్టీస్టారర్ .. పైగా పాన్ ఇండియా మూవీ అవ్వటం వలన ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది.  400 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 13 2021 న దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ మిగిలి ఉంది. ముప్పై నుంచి నలభై రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. రామ్ చరణ్ అలియాపై మేజర్ సీన్స్ రెండు పాటలు తెరకెక్కించాల్సి ఉంది.
 
అలాగని ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసే పరిస్థితి లేదు. అందువలన విడుదల తేదీని వాయిదా వేసే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను దసరాకి కాకుండా .. ‘సంక్రాంతి’ కి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.

  అయితే సంక్రాంతికి వరస పెట్టి పెద్ద సినిమాల రిలీజ్ క్యూ ఉంది. దాంతో ఏం చేయాలికొత్త డేట్ కోసం ఎలా ప్రయత్నించాలి అనే ఆలోచనలో టీమ్ మొత్తం ఉందని సమాచారం. సినిమా మేకింగ్ కన్నా రిలీజ్ డేట్ టెన్షన్ ఎక్కువైపోయిందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ప్రకటన వచ్చే అవకాసం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కరోనా పెద్ద సినిమాలతో దోబూచులాడుతోంది. ఏ విషయంలోనూ ఎటూ తేల్చుకోనీయకుండా చేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here