‘రాక్షసుడు’ దర్శకుడితో పవర్ స్టార్..!

0
75

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కమిటైన అర డజను సినిమాల్లో బండ్ల గణేష్ సినిమా ఒకటి. గతంలో పవన్ తో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు తీసిన బండ్ల గణేష్.. తన బాస్ తో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే సినిమా చేస్తానని చెప్పిన బండ్ల.. పవన్ కోసం ఏ డైరెక్టర్ ని సెట్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కోసం బండ్ల ఆల్రెడీ డైరెక్టర్ ని ఫిక్స్ చేశారని.. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా వినిపించడం జరిగిందని ఓ గాసిప్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

‘రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ.. పవన్ కళ్యాణ్ కి ఓ కథ వినిపించారట. స్టోరీ నచ్చడంతో పవన్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని.. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకోమని దర్శకుడికి చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఇది ఫేక్ న్యూస్ అయ్యుండొచ్చని అంటున్నారు. పవన్ ని దేవుడిగా ఆరాధించే బండ్ల.. ఆయన కోసం ఓ స్టార్ డైరెక్టర్ ని తీసుకొస్తారని పీకే ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వాస్తవానికి రమేష్ వర్మ ‘రాక్షసుడు’ సినిమా కంటే ముందు చాలా సినిమాలు చేసాడు. అయితే అవి ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. గతంలో మాస్ మహారాజా రవితేజ తో ‘వీర’ అనే సినిమా తీసిన రమేష్ వర్మ.. ప్రస్తుతం ‘ఖిలాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇదే క్రమంలో పవన్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది నిజమే అయితే ఆయన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది ఫ్యాన్స్ మదిలో ఉన్న డౌట్.

అయితే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పవన్ పెద్ద దర్శకుల కంటే చిన్న డైరెక్టర్స్ తో సినిమా చేయడం బెటర్ అని భావిస్తున్నారు. పవన్ డేట్స్ మరియు షూటింగ్ ప్లాన్స్ అన్నీ అనుకున్నట్టు జరగాలంటే చిన్న దర్శకులకు అవకాశం ఇవ్వొచ్చు. ఇటీవల చేసిన ‘వకీల్ సాబ్’.. ప్రస్తుతం చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. పవన్ సైతం స్టార్ డైరెక్టర్స్ వెనుక పడకుండా మంచి కథతో వచ్చే దర్శకులతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రమేష్ వర్మతో సినిమా చేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here