మోక్షజ్ఞ ఎంట్రీపై అదిరిపోయే న్యూస్: ఆదిత్య 999 కంటే ముందే.. పరిచయం చేయనున్న స్టార్ డైరెక్టర్

0
16

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఒకటి. అతడు టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం అవబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బాలయ్య తరచూ ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో అతడి రాక కోసం అభిమానులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

బాలకృష్ణ ప్రకటనతో హాట్ టాపిక్‌గా

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంఛ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కుర్రాడి రాక సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

అప్పుడా ఫొటోలు… ఫ్యాన్స్ నిరాశ

ఆ మధ్య నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలవి. వీటిలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అవి చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీంతో అతడు సినిమాల్లోకి రావడం కష్టమేనన్న టాక్ బాగా వినిపించిన సంగతి విధితమే.

కొడుకు ఎంట్రీ కోసం బాలయ్య ప్లాన్స్

నందమూరి బాలకృష్ణ తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి ఎంతో పట్టుదలగా ఉన్నారు. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా తెర ముందు జరిగితే.. తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ లుక్‌ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను, నటనలో మెళకువలకు గురువులను తీసుకొచ్చారు బాలయ్య. అంతేకాదు, మిగిలిన విభాగాల కోసం ఓ టీమ్‌ను రెడీ చేశారు.

రాజమౌళితో పాటు వాళ్లందరి చేతిలో

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య.. దర్శకధీరుడు రాజమౌళి చేతిలో పెట్టాడని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు.. తన శిష్యుడితో అతడిని లాంచ్ చేయాలని జక్కన్న కూడా భావించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. అదే సమయంలో మరికొందరు డైరెక్టర్ల పేర్లూ వినిపించాయి.

బాలయ్య కామెంట్స్.. ఆ మూవీతోనే

ఇటీవల నందమూరి బాలకృష్ణ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘త్వరలోనే తను హీరోగా పరిచయం కాబోతున్నాడు. అది కూడా నేను దర్శకత్వం వహించబోయే ఆదిత్య 999 అనే సినిమాతోనే అతడు రాబోతున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది’ అని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యత స్టార్ డైరెక్టర్‌కు

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించబోతున్నాడని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని కూడా అన్నారు. 2021 చివర్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఇది ఆదిత్య 999 కంటే ముందే వచ్చే అవకాశం ఉందన్న మాట.

మూవీ బాలయ్యతోనా? మోక్షజ్ఞతోనా?

నిజానికి ‘పైసా వసూల్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ మరో సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవలే ఈ కాంబోపై నటసింహా క్లారిటీ ఇచ్చేశారు. మళ్లీ ఇప్పుడు పూరీ.. మోక్షజ్ఞను పరిచయం చేస్తారని అంటున్నారు. దీంతో అసలు ఆయన బాలయ్యతో సినిమా చేస్తాడా? ఆయన కుమారుడిని పరిచయం చేస్తాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here