మెగాస్టార్ తో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తాడో..!

0
21

మెగాస్టార్ చిరంజీవితో – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ మూవీ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే కనుక నిజమైతే చిరు తో సందీప్ ఎలాంటి సినిమా తీస్తాడనే దాని గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.

‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా.. ప్రస్తుతం హిందీలో రణ్ బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత మెగాస్టార్ తో నే సందీప్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిరు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఓ కథ రెడీ చేసుకున్న సందీప్.. త్వరలోనే ఆయనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు.

చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఇమేజ్ ని వయసుని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ కథలను.. దానికి తగ్గట్టు పాత్రలను ఎంచుకుంటున్నారు. అయితే యంగ్ డైరెక్టర్ సందీప్ చేసిన రెండు సినిమాలు రా అండ్ రస్టిక్ గా రూపొందాయి. ప్రస్తుతం చేస్తున్న ‘యానిమల్’ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందే ఓ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది.

ఒకవేళ చిరు – సందీప్ వంగా కాంబినేషన్ నిజమే అనుకుంటే సినీ అభిమానులు కచ్చితంగా మరో వైవిధ్యమైన చిత్రాన్ని ఎక్సపెక్ట్ చేస్తారు. దీనికి తగ్గట్టే మెగా ఫ్యాన్స్ కూడా సందీప్ కి మెగాస్టార్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరి కలయికలో విభిన్నమైన సినిమాని చూసే అవకాశం దక్కుతుందేమో.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఇందులో తనయుడు రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. ఇదే క్రమంలో మెహర్ రమేష్ తో ‘వేదళమ్’ రీమేక్ చేయనున్నారు. అలానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here