మూవీ స్టార్ట్ కాకముందే అంచనాలు పెంచేసిన మహేష్..!

0
26

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్లుగా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే ఖచ్చితమైన హిట్ సినిమాలు మహేష్ నుండి వస్తున్నాయి. శ్రీమంతుడు సినిమా నుండి మహేష్ వెనక్కి తిరిగి చూసింది లేదు. మధ్యలో బ్రహ్మోత్సవం అనే ప్లాప్ పడినాసరే మళ్లీ భరత్ అనే నేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ సినిమా అంటే మినిమమ్ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అనే విధంగా మేకర్స్ కూడా జాగ్రత్తపడుతున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు తనకు హిట్స్ దర్శకులతో మరో సినిమా చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

గతంలో ఒక్కడు సినిమా చేసాక మహేష్ గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ – సైనికుడు సినిమాలు చేసాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు చేసాక ఖలేజా సినిమా.. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి – బిజినెస్ మ్యాన్ శ్రీనువైట్లతో దూకుడు – ఆగడు కొరటాల శివతో శ్రీమంతుడు – భరత్ అనే నేను.. ఇలా చేస్తూ వచ్చాడు. ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసాడు మహేష్. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా వీరి కాంబినేషన్ గురించి చర్చలు జరుపుతుంది. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో మహేష్ క్యారెక్టర్ గురించి ప్రస్తుతం పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రా-ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తుంది. అందులోను త్రివిక్రమ్ సినిమాలో రా-ఏజెంట్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే మహేష్ బాబుకు త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ అలా ఉంటాయి. ఇదివరకు విడుదలైన వీరి రెండు సినిమాలు ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్ సినిమాలుగా మారాయి. మరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అసలే ఇద్దరూ కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు – పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here