‘ముంబయ్ సాగా’ మీద మనసు పడ్డ మెగా హీరోలు..?

0
30

మెగా కాంపౌండ్ హీరోలు ఇప్పటివరకు అనేక రీమేక్ చిత్రాలలో నటించారు. ఇతర భాషల్లో హిట్ అయిన కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ప్రెజెంట్ ఆ కాంపౌండ్ లో నాలుగు రీమేక్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ క్రైమ్ డ్రామా ”ముంబై సాగా” మీద మెగా హీరోలు మనసు పడ్డారని తెలుస్తోంది.

జాన్ అబ్రహం – ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన సినిమా ‘ముంబై సాగా’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు వైట్ ఫెదర్ ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి నిర్మించాయి. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కోవిడ్ ప్రభావం వల్ల మంచి వసూళ్ళు రాబట్టలేకపోయింది.

అయితే రీసెంటుగా ‘ముంబై సాగా’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు. దీనికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ స్టోరీని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయట. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసి మెచ్చిన ఇద్దరు మెగా హీరోలు ఈ తెలుగు రీమేక్ లో నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

బాంబే ముంబైగా మారకముందు.. అండర్ వరల్డ్ హవా నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో జాన్ అబ్రహం నటించగా.. గ్యాంగ్ స్టర్స్ కి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించాడు. మరి ఇప్పుడు ‘ముంబై సాగా’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఏ విధంగా మార్పులు చేస్తారో చూడాలి. అసలు ఈ హిందీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here