‘మిర్చి’లో మాదిరిగా ‘ఆచార్య’లో హైలైట్ గా రెయిన్ ఫైట్..!

0
17

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”ఆచార్య”. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మారేడుమిల్లి ఫారెస్ట్స్ మరియు గోదావరిఖని షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చరణ్.. ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కు సమీపంలోని కోకాపేటలో వేసిన భారీ ధర్మస్థలి సెట్ లో ఈ సినిమాలు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇందులో భాగంగా చరణ్ – బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ లపై కొరటాల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇది వర్షంలో చిత్రీకరిస్తున్నారని.. రెయిన్ ఫైట్స్ లో బెస్ట్ గా నిలిచేలా కొరటాల దీనిని డిజైన్ చేసారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘మిర్చి’ లో రెయిన్ ఫైట్ మాదిరిగానే ఈ సినిమాలో చరణ్ పై ప్లాన్ చేసిన ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అలానే చిరంజీవి – రెజీనా లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్.. చరణ్ – పూజా హెగ్డే లతో చేసిన మెలోడీ సాంగ్ అభిమానులను హుషారెత్తిస్తాయని టాక్ నడుస్తోంది.
 
కాగా ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here