మహేష్ తో అలాంటి సినిమా మాత్రం చేయొద్దని త్రివిక్రమ్ ని కోరుతున్న ఫ్యాన్స్..!

0
19

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేశ్ తోపాటు త్రివిక్రమ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకే 11 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుస్తున్న వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వచ్చిన రోజు నుంచి దీని గురించి డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. హీరోయిన్స్ గా వీరిని తీసుకుంటున్నారని.. టైటిల్ ఇదేనని.. సినిమా నేపథ్యం ఏంటని వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మహేష్ అభిమానులు సైతం త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి సినిమా తీస్తాడో అని చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ ఈ మధ్య బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ కథ నడిపించేలా సినిమాలు తీస్తున్నాడు. కీలకమైన పాత్రకు ఓ సీనియర్ నటిని తీసుకొని.. ఇద్దరు హీరోయిన్లను పెట్టుకుని కథ నడిపిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. డబ్బున్నోల్లు – పేదోళ్లు.. కంపెనీ సీఈఓ లు అంటూ కార్పొరేట్ కల్చర్ చూపించడం.. వంటివి మాత్రమే ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలలో ఉంటున్నాయని చెప్పుకుంటారు. అందుకే ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమా వాటికి భిన్నంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వాస్తవానికి మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన రెండు చిత్రాలు కూడా అప్పటికి డిఫరెంట్ గా స్పెషల్ గా రూపొందినవనే చెప్పవచ్చు. అందుకే అవి రిజల్ట్ తో సంబంధం లేకుండా క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. మహేష్ కు కూడా ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఇటీవల ఎలాంటి సినిమాలు చేసినా ఇప్పుడు మహేష్ తో మాత్రం కొత్త తరహా కథనే తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ‘#SSMB28’ అనౌన్స్ మెంట్ లోనే ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు.  మరి ఈ హ్యాట్రిక్ మూవీ కోసం త్రివిక్రమ్ ఏకాంటి కాన్సెప్ట్ తో వస్తున్నాడో చూడాలి.

ఇకపోతే ‘#SSMB28’ చిత్రానికి ”పార్థు” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. కోవిడ్ -19 పరిస్థితులు చక్కబడితే ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here