భానుమతి ‘నో’ జాబితాలో మరో క్రేజీ మూవీ?

0
22

తెలుగు  ప్రేక్షకులకు భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల అంటూ పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ మలయాళి ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. తెలుగులో ఈమెకు ఒక్కసారిగా ఆఫర్లు వెళ్లువెత్తాయి. అయినా కూడా ఈ అమ్మడు ఆశకు వెళ్లకుండా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా తన మనసుకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తూ వస్తోంది. ఈ అమ్మడు కథ లో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప సినిమాలను కమిట్ అవ్వదు. కమర్షియల్ హీరోయిన్ గా హీరో పక్కన కొన్ని సాంగ్స్.. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్న పాత్రను చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

సాయి పల్లవి పారితోషికం కు ఆశపడి ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడం లేదు. కెరీర్ ఆరంభంలోనే ఒక యంగ్ హీరో హీరోతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా లో నటించేందుకు పాత్ర నచ్చలేదని నో చెప్పిందట. అప్పటి నుండి సాయి పల్లవి ఎన్నో సినిమాలకు నో చెబుతూనే వచ్చింది. పెద్ద హీరోల సినిమా ల్లో కూడా ఈమ నటించాలంటే తన పాత్రకు ప్రాముఖ్యత ఉండాలనే అంటోందట. తన పాత్రకు ప్రాముఖ్యత లేనట్లయితే కోట్ల పారితోషికంను కూడా ఆమె తిరష్కరిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా మరో సినిమా ను సాయి పల్లవి తిరష్కరించిందని తెలుస్తోంది.

ఏకంగా రెండు కోట్ల రూపాయల ఆఫర్ ను ఇచ్చిన ఒక బాలీవుడ్ సంస్థకు సాయి పల్లవి నో చెప్పిందట. అసలు మ్యాటర్ ఏంటంటే మన బెల్లంకొండ బాబు బాలీవుడ్ లో చత్రపతి సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. రీమేక్ లో స్టార్ హీరోయిన్స్ ను నటింపజేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అంటూ మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ కు చెందిన పలువురు ముద్దుగుమ్మలను వీరు సంప్రదించారు. కాని వారిలో చాలా మంది నో చెప్పారు.

ఇటీవల రెండు కోట్ల ఆఫర్ చేసి సాయి పల్లవిని సంప్రదించారట. బిజీగా ఉన్నానంటూ సాయి పల్లవి ఆ ఆఫర్ ను తిరష్కరించిందంటూ సమాచారం అందుతోంది. సాయి పల్లవి డిమాండ్ చేస్తే మరో అరకోటి ఇచ్చి అయినా చత్రపతి రీమేక్ లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి… కాని పాత్ర ప్రాముఖ్యత నేపథ్యంలో ఆమె తిరష్కరించి ఉంటుందని.. ఆమె నో చెప్పిన క్రేజీ చిత్రాల జాబితాలో హిందీ చత్రపతి కూడా చేరిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here