‘బాహుబలి’ ‘కేజీఎఫ్’ మాదిరిగా రెండు భాగాలుగా ‘పుష్ప’..?

0
30

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ”పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ స్టోరీని రెండు భాగాలు చేయడానికి స్కోప్ ఉందని.. దీని గురించి బన్నీ – సుక్కూ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

‘పుష్ప’ కంటెంట్ ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి సుక్కు అండ్ టీమ్ బన్నీ కి వివరించారట. దీనికి హీరో సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ చిత్రాన్ని 2 పార్ట్స్ గా చెప్పడానికి నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగానికి సరిపడా షూటింగ్ దాదాపుగా ఇప్పటికే పూర్తి చేయగా.. 15 రోజుల షెడ్యూల్ లో మిగతా పోర్షన్ కూడా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోవడంతో సుకుమార్ ప్రస్తుతం ఫస్ట్ భాగానికి కంటెంట్ ని రఫ్ కట్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ‘బాహుబలి’ ‘కేజీఎఫ్’ సినిమాల మాదిరిగా ‘పుష్ప’ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారు.

‘పుష్ప’ సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టి సెకండ్ పార్ట్ ని కంటిన్యూ చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇకపోతే కరోనా పరిస్థితులను బట్టి మొదటి భాగాన్ని దసరా సీజన్ లో లేదా ఏడాది చివర్లో కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే రెండో భాగాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here