బాలీవుడ్ హీరోయిన్ తో.. పాకిస్థాన్ ప్రధాని ప్రేమాయణం?

0
25

పాకిస్థాన్ – భారత్ సంబంధాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో.. ప్రతీఅంశం కూడా పతాక స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. ఇక ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ సినిమా వంటి విషయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండుదేశాలతోపాటు ప్రపంచం కూడా దృష్టి సారిస్తుంది. ఇలాంటి ఓ వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.  దాదాపు మూడు దశాబ్దాల కిందట సంచలనం సృష్టించిన ప్రేమ్ కహానీ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!

క్రికెటర్ గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఆల్ రౌండర్ ఇమ్రాన్ టాలెంట్ ఏంటన్నది ప్రపంచం మొత్తానికీ తెలుసు. జెంటిల్మెన్ గేమ్ లో దిగ్గజ ఆటగాళ్ల జాబితా తీస్తే.. అందులో ముందు వరసలోనే ఉంటాడు ఇమ్రాన్. మరి అంతటి టాప్ క్రికెటర్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే.

బాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు కూడా ఇమ్రాన్ ను ఇష్టపడేవారు. అయితే.. నాటి ప్రముఖ హీరోయిన్ రేఖ మరో అడుగు ముందుకేసి అతన్ని ప్రేమించిందని సమాచారం. ఇమ్రాన్ కూడా రేఖను ప్రేమించారట. ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ప్రేమాయణం కారణంగా ఇమ్రాన్ తరచూ ఇండియా వచ్చేవాడట. ఈ విషయం రేఖ తల్లికి కూడా తెలుసట! ఓసారి ఏకంగా ముంబైలో నెలరోజులపాటు ఉన్నాడట. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని బీచ్ ల వెంట జాలీగా తిరిగేవారట. అయితే.. కారణాలేంటో తెలియదుగానీ.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారట.

ఈ వివరాలన్నీ ఆ పేపర్ క్లిప్పింగ్ లో ఉన్నాయి. అందులో మరో విశేషం కూడా ఉంది. ఇమ్రాన్ రేఖతోనే కాకుండా.. షబానా అజ్మీ జీనత్ ఆమన్ తోనూ ప్రేమాయణం నడిపాడట. ఇది నిజమైన వార్తనా? పుకారా? అన్నది తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here