బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇక్కడికే.. ప్రభాస్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

0
22

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”ఆదిపురుష్”. చెడు మీద మంచి గెలవడం అనే నేపథ్యంలో రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇక సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. మొత్తం 150 రోజుల్లో ఈ సినిమాని షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్.. ముంబైలో ప్రత్యేకమైన సెట్స్ లో సుమారు 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. కరోనా ఉదృతి పెరగడంతో చిత్రీకరణను నిలిపేశారు. ఇప్పుడు ముంబైలో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో ‘ఆదిపురుష్’ టీమ్ మొత్తం హైదరాబాద్ రాబోతుందని సమాచారం.

‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి మిగతా షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ పై చేయాల్సి ఉందట. మొత్తం ఇండోర్ లో చేయాల్సినదే కావడంతో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇందుకు అనువైన ప్రదేశమని ప్రభాస్ చిత్ర యూనిట్ కు సూచించాడట. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ లో దిగి ‘ఆదిపురుష్’ సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఇక్కడ 90 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోకున్నారని టాక్. సైఫ్ – కృతి సనన్ – సన్నీ సింగ్ తో పాటుగా మిగతా బాలీవుడ్ నటీనటులు ఇందులో పాల్గొననున్నారు. ప్రభాస్ వ్యక్తిగత టీమ్ కూడా బాలీవుడ్ స్టార్స్ కోసం తగిన ఏర్పాట్లను చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక్కడే షూటింగ్ కాబట్టి మిగిలిన సినిమాల షూట్ లో కూడా పాల్గొనడం ప్రభాస్ కు ఈజీ అవుతుందని చెప్పవచ్చు.

కాగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పాన్ ఇండియా సస్థాయిలో తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here