బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న ‘టాలీవుడ్ రత్తాలు’..?

0
28

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ – ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్న గోపీచంద్ మలినేని.. బాలయ్య కోసం వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటు కల్పించారని టాక్ నడుస్తోంది.

గోపీచంద్ మలినేని గత చిత్రాల్లో ఇద్దరు చూసుకుంటే ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ తో పాటుగా వరలక్ష్మీ శరత్ కుమార్ కి కూడా ‘జయమ్మ’ అనే గుర్తుండి పోయే రోల్ ఇచ్చారు. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమాలో బాలయ్య తో ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేస్తారని అంటున్నారు. అందులో ఒక హీరోయిన్ గా రాయ్ లక్ష్మీ ని తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే బాలయ్య నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్ ఎవరైనా కానీ హీరోయిన్ మాత్రం రాయ్ లక్ష్మీనే అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలో బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ సినిమాలో రాయ్ లక్ష్మీతో ఓ స్పెషల్ సాంగ్ చేయించమని బోయపాటి శ్రీను కు సిఫార్సులు వెళ్లాయట. అలానే గోపీచంద్ మలినేని తో చేసే సినిమాలో ఒక హీరోయిన్ గా తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే బాలయ్య సినిమా కోసం గోపీచంద్ ఇప్పుడు వేటపాలెంలోని 100 ఏళ్ల క్రితం నాటి పురాతనమైన లైబ్రరీలో పాత వార్తాపత్రికలతో పరిశోధన చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ ‘అఖండ’ షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ సినిమా ప్రారంభిస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here