బాలకృష్ణ సరసన భాగ్యలక్ష్మి!

0
23

నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మి (శ్రుతి) నటిస్తోందా? అంటే అవుననే సమాచారం. ఇది రేర్ కలయిక.. కానీ సాధ్యమవుతోంది. ఇంతకీ శ్రుతిహాసన్ కమిటైనట్టేనా? అంటే అవుననే తెలుస్తోంది.

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని ఓ భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య పోలీసాఫీసర్ గా .. నాయకుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే బాలయ్య కోసం తన లక్కీ ఛామ్ శ్రుతిహాసన్ ని ఇప్పటికే గోపిచంద్ మలినేని లాక్ చేశారట. అతడు తెరకెక్కించిన బలుపు-క్రాక్ చిత్రాల్లో శ్రుతి కథానాయిక. ఆ రెండు సినిమాలు విజయం సాధించిన నేపథ్యంలో సెంటిమెంటుగా హ్యాట్రిక్ మూవీకి శ్రుతిని కావాలని ఎంపిక చేశారట.

ఈ చిత్రంలో మరో నాయికను ఫైనల్ చేయాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది జూలై నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలయ్యతో బోయపాటి అఖండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరవాత గోపిచంద్ తో మూవీ సెట్స్ కెళ్లనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here