బాబోయ్.. యేలేటిని కూడా వదలని ప్రభాస్

0
19

ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్  బిజీ స్టార్ ఎవరంటే మరో అనుమానం లేకుండా వినిపించే పేర్లలో ప్రభాస్ పేరు ఉంటుంది. వరుస పాన్ ఇండియా.. తెలుగు.. హిందీ సినిమాలతో మన యంగ్ రెబల్ స్టార్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకు పోతున్నాడు. రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.. ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవ్వల్సి ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ రెగ్యులర్ గా కథలు వింటూనే ఉన్నాడట.. కొత్త సినిమాలకు ఓకే చెబుతూనే ఉన్నాడట. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుధ కొంగర దర్శకత్వం లో సినిమా అన్నారు.. ఇప్పుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా అంటున్నారు.

నిప్పు లేనిదే పొగ రాదంటారు. ప్రభాస్ సినిమాల విషయంలో కూడా అది నిజం అయ్యి ఉంటుంది. చిన్న పాటి చర్చలు కూడా లేకుండా ప్రభాస్ ఆ దర్శకుడితో.. ఈ సినిమాలో అంటూ పుకార్లు పుట్టవు. కనుక సుధ కొంగర కథ ను ప్రభాస్ విన్న విషయం నిజమే అయ్యి ఉంటుందని అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా కూడా నిజమే అయ్యి ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వందల కోట్లు. ఆయన ఏ సినిమా చేసినా బిజినెస్ వందల కోట్లల్లో ఉంటుంది. అలాంటి ప్రభాస్ చంద్రశేఖర్ యేలేటి వంటి విభిన్న చిత్రాల దర్శకుడితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

చంద్ర శేఖర్ యేలేటి ఖచ్చితంగాఒక విభిన్న చిత్రాల దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా ఒక విభిన్న తరహా సినిమా అన్నట్లుగా మాత్రం టాక్ ను సొంతం చేసుకుంటుంది. అలాంటి విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన కథను వినేందుకు ప్రభాస్ ఓకే చెప్పడం పెద్ద విషయమే.

వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే తప్పకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కాని కొందరు మాత్రం ఈ క్రేజీ కాంబోలో సినిమా చూడాలనుకుంటున్నట్లుగా  అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కొందరు బాబోయ్ ప్రభాస్ చంద్రశేఖర్ యేలేటితో ప్రభాస్ సినిమా ఏంటీ అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here